BREAKING: SRH టార్గెట్ ఎంతంటే?

ఉప్పల్ వేదికగా SRHతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ ముగిసింది. ఓపెనర్లు డుప్లెసిస్ (3), కరుణ్ నాయర్ (0) నిరాశపరిచారు. కేఎల్ రాహుల్ (10), అక్షర్ పటేల్ (6) తేలిపోయారు. చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ (41*), అశుతోష్ శర్మ (41) రాణించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. SRH బౌలర్లలో కమిన్స్ 3 వికెట్లు తీశాడు.