ఉప్పల్ రింగ్ రోడ్డులో ఆకాశాన్ని తాకేలా వంతెన..!

ఉప్పల్ రింగ్ రోడ్డులో ఆకాశాన్ని తాకేలా వంతెన..!

హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే హైవేపై ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఆకాశాన్ని తాకేలా వంతెన నిర్మాణం ప్రారంభమైంది. ఇప్పటికే హై‌రైస్ పిల్లర్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నారపల్లి దిశగా వెళ్లే ఈ ఎలివేటెడ్ కారిడార్, రింగ్ రోడ్డు వద్ద ఉన్న మెట్రో పై నుంచి వెళ్లేలా ఇంజనీర్లు డిజైన్ చేశారు. ఈ వంతెన పూర్తైతే ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని అధికారులు తెలిపారు.