VIDEO: ఘనంగా శ్రీ కోదండ రామయ్య గ్రామోత్సవం
NLR: అల్లూరు మండలం పురిణి కొత్తపాలెం గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం శనివారం వేకువజామున ప్రత్యేక పుష్పాలంకరణ, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కోదండ రామయ్య గ్రామోత్సవ కార్యక్రమం ఘనంగా సాగింది. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. తదుపరి ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.