చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన ధర

చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన ధర

కోనసీమ: జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు మాంసం ప్రియలుకు ఊరటనిచ్చే విధంగా ఉన్నాయి. కేజీ చికెన్ 160 రూపాయలకు విక్రయిస్తున్నట్లు దుకాణాదారులు వివరించారు. స్కిన్ లెస్ చికెన్ కేజీ 200 రూపాయలకు విక్రయిస్తున్నట్లు వివరించారు. కార్తీక మాసం అయినప్పటికీ చేపలు, రొయ్యలు, మటన్, చికెన్ అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. అయితే ప్రాంతాలను బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చన్నారు.