పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

AP: రాష్ట్రంలోని పలు జిల్లాలకు APSDMA రెడ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి, తూ.గో, ప.గో. ఏలూరు, NTR, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్సాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండొద్దని సూచించింది. అలాగే బాపట్ల, గుంటూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయంది.