అధికారులపై వెంటనే విచారణ చేపట్టాలి: డిప్యూటీ సీఎం
KMM: డ్వాక్రా రుణ వేధింపులపై శనివారం బోనకల్ వద్ద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాన్వాయ్‌ను మహిళలు అడ్డుకున్నారు. వేధిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రూ. 10 లక్షల రుణంపై రూ. 15 లక్షలు చెల్లించాలని అధికారులు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ జరిపి నివేదిక సమర్పించాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు.