ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రిలో దారుణం!
RR: ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రిలో దారుణ ఘటన వెలుగు చూసింది. బాధితుల వివరాలు.. మహబూబాబాద్ జిల్లాకు చెందిన నరేశ్(38) గుండెల్లో నొప్పితో ఆసుపత్రికి వచ్చాడు. జూనియర్ డాక్టర్లు ఆపరేషన్ చేయడంతో ఆ వ్యక్తి మృతి చెందినట్లు, యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే మృతి చెందినట్లు బంధువులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు.