మల్లవరం హైవేపై రెండు కార్లు ఢీ

మల్లవరం హైవేపై రెండు కార్లు ఢీ

TPT: తిరుపతి రూరల్ సి.మల్లవరం హైవే జంక్షన్ వద్ద మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు నుంచి తమిళనాడు వెళుతున్న ఓ ఇన్నోవా కారు పీలేరు వస్తున్న మరొక కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. హైవే సిబ్బంది, పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.