VIDEO: వరి కోత వేళ.. వర్షం రాకతో రైతుల ఆందోళన

నెల్లూరు: జిల్లాలో ఖరీఫ్ వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న వేళ వరుణుడి భయం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. విడవలూరు, కొడవలూరు, బుచ్చి, ఇందుకూరుపేట, బోగోలు, అల్లూరు మండలాల్లో కోతలు సాగుతున్నాయి. రైతులు యంత్రాలతో కోసిన ధాన్యాన్ని ట్రాక్టర్లతో రోడ్లపై ఆరబెడుతున్నారు. వర్షం ఎప్పుడు పడుతుందో తెలియక చాలామంది సందిగ్ధంలో ఉన్నారు.