మరో ఐదుగురిపై పీడీ యాక్ట్ నమోదు
నెల్లూరు సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కపాడిపాలెంలో పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఒకే కుటుంబంలోని ఐదుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో సిరాజ్, సుభాషిణి మరో ముగ్గురు ఉన్నారు. వారిపై పీడీ యాక్ట్ నమోదు చేశామని సీఐ సోమయ్య తెలిపారు.