పద్మనాభంలో పర్యటించిన మంత్రి డోలా
VSP: పద్మనాభం మండలం రెడ్డిపల్లెలో మంత్రి భరత్‌తో కలిసి మంత్రి డోలా బుధవారం పర్యటించారు. అనంతరం పేదలకు ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 'ప్రతి పేదవాడికి సొంతిల్లు కల్పించాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం' అని అన్నారు. ఒకే రోజు 3 లక్షల గృహప్రవేశాలు చరిత్రగా నిలుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు.