హరీష్ రావును పరామర్శించిన ఎంపీ డీకే అరుణ
MBNR: మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి ఇటీవల మరణించిన నేపథ్యంలో హరీష్ రావును మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ ఇవాళ పరామర్శించారు. హరీష్ రావు తండ్రి చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీతో పాటు స్థానిక నాయకులు కార్యకర్తలు ఉన్నారు.