మద్యం మత్తులో పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య

WGL: మద్యం మత్తులో పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పర్వతగిరి మండలం ఏనుగల్లు ఆదివారం చోటుచేసుకుంది. పెరుమండ్ల యాకాంతం (45) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు. మృతుడి భార్య సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.