ఎస్. సి. కాలనీలో జాతీయ జెండాలు పంపిణీ

VZM: జామి మండలం తాండ్రంగి గ్రామంలో ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు కొత్తలి గౌరి నాయుడు ఆగస్టు 15 నేపథ్యంలో ఎస్ సి.కాలనీ జాతీయ జెండాలను గురువారం పంపిణీ చేశారు. ముందుగా కాలనీ వాసులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్రం కోసం ఎందరో మహానుభావులు ప్రాణాలను దేశం కోసం అర్పించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో యువకులు పాల్గొన్నారు.