కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ASR: రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పాడేరు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ సోమవారం తెలిపారు. జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్‌లో 24గంటలూ పనిచేసే విధంగా 18004256826టోల్ ఫ్రీ నెంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు.