క్యాన్సర్ ఫైటర్లకు నన్మానం

మోపాల్: నగర శివారు మాధవ నగర్‌లోని ఇందూరు క్యాన్సర్ ఆసుపత్రిలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా క్యాన్సర్‌ను జయించిన రోగులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమ రాజ్, ఆస్పత్రి ప్రతినిధి చినబాబు, వైద్యులు వేణుగోపాల్ పాల్గొన్నారు.