గాజులదిన్నె జలాశయంలో పెరిగిన నీటిమట్టం..

KRNL: జిల్లాకే జీవనాడిగా ఉన్న గాజులదిన్నె జలాశయానికి భారీగా వర్షపు నీరు వచ్చి చేరుకుంటోంది. పది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఇప్పటి వరకు 1.3 టీఎంసీల నీరు గాజులదిన్నె ప్రాజెక్టులో వచ్చి చేరినట్లు ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇంజినీర్ మహమ్మద్ అలీ తెలిపారు. ప్రాజెక్ట్ మొత్తం నీటి సామర్థ్యం 4.5 టీఎంసీలు ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 2.65 టీఎంసీలుగా నీటిమట్టం ఉన్నట్లు తెలియాజేశారు.