బాధితుడి ఇంటికే వెళ్లి ఫోన్ అందజేత

బాధితుడి ఇంటికే వెళ్లి ఫోన్ అందజేత

ATP: ​‘మీ ఇంటికి మీ మొబైల్’ కార్యక్రమంలో భాగంగా తాడిపత్రి రూరల్ మండలం గన్నెవారిపల్లికి చెందిన చంద్రశేఖర్‌కు పోగొట్టుకున్న మొబైల్ తిరిగి దక్కింది. ఏడాది క్రితం రూ. 25 వేల విలువైన వీవో ఫోన్ పోగొట్టుకోగా, జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాలతో పోలీసులు దానిని రికవరీ చేశారు. ఇవాళ సీఐ శివగంగాధర్ రెడ్డి బాధితుడి ఇంటికి నేరుగా వెళ్లి ఫోన్‌ను అందజేశారు.