అదుపుతప్పి కూరగాయల వ్యాన్ బోల్తా

అదుపుతప్పి కూరగాయల వ్యాన్ బోల్తా

KMM: కూసుమంచి మండల సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం కూరగాయల లోడుతో వెళ్తున్న మినీ వ్యాన్ బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్తున్న ఈ వాహనం, హట్యా తండా సమీపంలో సాంకేతిక సమస్య కారణంగా అదుపుతప్పి బోల్తా కొట్టినట్లు డ్రైవర్ తెలిపాడు. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.