చిట్టిబాబుకు అభినందనలు తెల్పిన బార్ అసోసియేషన్

చిట్టిబాబుకు అభినందనలు తెల్పిన బార్ అసోసియేషన్

VZM: జిల్లా కోర్టు ప్రాంగణంలో విజయనగరం అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సి సుబ్రహ్మణ్యం జాతీయ అవార్డు గ్రహీత పెంకి చిట్టిబాబును సోమవారం ఘనంగా సన్మానించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె.రవిబాబు మాట్లాడుతూ.. భారత రత్న "సి సుబ్రహ్మణ్యం జాతీయ అవార్డు"ను బార్ సభ్యుడు పెంకి చిట్టిబాబు అందుకోవడం న్యాయ వాదులందరికీ గర్వకారణం అని అన్నారు.