వైరల్ అవుతున్న 'అఖండ 2' వీడియో సాంగ్
బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ 2 ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన 'అఖండ తాండవం' అనే సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాట సినిమాలో లేకపోవడంతో దీనిని చేర్చాలని బాలయ్య ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. కాగా అఖండ 2కు పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ పరంగా దూసుకెళ్తుంది.