ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని యువతి ఆత్మహత్య

పెద్దపల్లి: రాయికల్ మండలంలోని ధర్మాజీపేట గ్రామానికి చెందిన భూక్య మల్లీశ్వరీ(20) అనే యువతి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సుధీర్ రావు శుక్రవారం తెలిపారు. ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుందని తల్లి భూక్య కళ ఫిర్యాదు చేసిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.