VIDEO: కమిషనర్ ఆదేశాల మేరకు ఆక్రమణలు తొలగింపు
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ. నందన్ ఆదేశాల మేరకు స్థానిక 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఆక్రమణలను తొలగించారు. ప్రభుత్వ, కార్పొరేషన్ స్థలాలు, రోడ్లు, డ్రైనేజీ కాలువలను ఆక్రమించి ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని కమిషనర్ సూచించారు. అలాగే, రోడ్డు మార్జిన్ దాటిన మెట్లు, ర్యాంపులు వంటి నిర్మాణాలను తొలగిస్తామని ఆయన హెచ్చరించారు.