'మతిస్థిమితం లేని నిరాశ్రయుల వివరాలు ఇవ్వండి'

'మతిస్థిమితం లేని నిరాశ్రయుల వివరాలు ఇవ్వండి'

VZM: జిల్లాలో రహదారులపై మతిస్థిమితం లేని నిరాశ్రయులకు సహాయం అందించేందుకు ‘మనోబంధు ఫౌండేషన్’ ముందుకు రావడం అభినందనీయమని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఫౌండేషన్ వాల్ పోస్టర్‌ను ఎస్పీ తన కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తుల వివరాలను www.manobhandhu.org వెబ్‌సైట్‌కి పంపించాలని ఆయన కోరారు.