జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం
PPM: జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 68 కేంద్రాల్లో 10,646 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని డీఈఓ బ్రహ్మాజీరావు తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరుగుతాయని, పర్యవేక్షణ కోసం చీఫ్ సూపరింటెండెంట్లు, స్వ్కాడ్‌లు, ఇన్విజిలేటర్‌లను నియమించామని చెప్పారు.