పోర్ట్‌లో నిలిచిపోయిన కార్యకలాపాలు
KKD: నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కేంద్ర కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె ప్రభావంతో కాకినాడ సీపోర్ట్‌లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. గురువారం తెల్లవారుజాము నుంచే కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు పోర్టుకు చేరుకుని కార్యకలాపాలను స్తంభింపజేశారు. ఈ సందర్భంగా అక్కడ నిరసన కార్యక్రమం నిర్వహించి నినాదాలు చేశారు.