VIDEO: అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్
WGL: పర్వతగిరి మండలం చెరువుకొమ్ము తండాలో పలు బెల్ట్ షాపులకు వైన్ షాపు నిర్వాహకులు మద్యం సీసాలపై స్టిక్కర్లు అతికించి తరలిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ బెల్ట్ షాపుల్లో మద్యం నిర్ణీత ధరలకంటే ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నారని మద్యం ప్రియులు వాపోతున్నారు. అక్రమ విక్రయాలపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదివారం డిమాండ్ చేస్తున్నారు.