గోరంట్లలో రేషన్ షాప్ డీలర్లతో సమావేశం
SS: గోరంట్లలోని రేషన్ షాపులలో ప్రతి నెలా ప్రజలకు సకాలంలో సరుకులు పంపిణీ చేయాలని గోరంట్ల టీడీపీ కన్వీనర్ గుత్తా బాలకృష్ణ చౌదరి తెలిపారు. బుధవారం గోరంట్ల టీడీపీ కార్యాలయంలో రేషన్ షాప్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. కన్వీనర్ మాట్లాడుతూ.. నిత్యావసర సరుకులను సకాలంలో ప్రతి లబ్ధిదారునికి అందించాలని, ఎక్కడా అక్రమాలు జరగకుండా పంపిణీ చేయాలని సూచించారు.