నందిగామలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన ర్యాలీ

నందిగామలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన ర్యాలీ

NTR: ఎయిడ్స్ వ్యాధిపై అవగాహనే ప్రధాన ఆయుధమని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. నందిగామ పట్టణంలోని డీవీఆర్ ఏరియా హాస్పిటల్‌లో సోమవారం ప్రపంచ ఎయిడ్స్ డే అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన పెంపొందించడం, అపోహలను తొలగించడం, సురక్షితమైన జీవనశైలి పాటించాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియజేసే నినాదాలు వినిపించారు.