VIDEO: జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ పలు శాఖల్లో తనిఖీలు చేశారు. ఇటీవల అవినీతి ఆరోపణలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ దాడులు చేపట్టినట్లు సమాచారం. గతంలోనూ ఇక్కడ పలుమార్లు ఏసీబీ, విజిలెన్స్ దాడులు జరిగాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.