మహిళా పోలీసులతో సీఐ సమావేశం

VZM: కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న మహిళా సచివాలయ ఉద్యోగులతో సీఐ షణ్ముఖరావు మంగళవారం సమావేశం నిర్వహించారు. శక్తి యాప్ పట్ల గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామాల్లో మహిళలపై లైంగిక దాడులు జరగకుండా చూడాలని కోరారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే తన దృష్టికి తేవాలని పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలన్నారు.