సీఎంఆర్ ధాన్యంలో రైస్ మిల్లుల గోల్ మాల్

సీఎంఆర్ ధాన్యంలో రైస్ మిల్లుల గోల్ మాల్

SRD: ఆందోల్ మండలం డాకూర్‍లోని కన్యకా పరమేశ్వరి ఆగ్రో ఇండస్ట్రీస్‌లో విజిలెన్స్‌ ఎన్ఫోర్స్ మెంట్ అధికారుల ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ దాడిలో 2024-25 సంబంధించిన 3752.80 క్వింటాళ్ల CMR ధాన్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.87,06,496 ఉంటుందని వెల్లడించారు. మిల్లు యజమానిపై తదుపరి చర్యలకై జిల్లా పౌర సరఫరాల విభాగానికి సిఫార్సు చేశారు.