రూ. వెయ్యి ఇచ్చి.. రూ.1.38 కోట్లు కొట్టేశారు..!

రూ. వెయ్యి ఇచ్చి.. రూ.1.38 కోట్లు కొట్టేశారు..!

హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి ట్రేడింగ్ పేరుతో సైబర్‌నేరగాళ్ల వలలో పడి రూ. 1.38 కోట్లు పోగొట్టుకున్నాడు. వాట్సాప్‌గ్రూప్‌లో చేర్చి, రూ. 1000 లాభం చూపించి నమ్మించారు. ఎక్కువ పెట్టుబడులు పెట్టాలని ప్రేరేపించి, రూ. 1.38 కోట్లు డిపాజిట్ చేయించారు. చివరికి, రూ.40 కోట్ల లాభాలు స్క్రీన్‌పై చూపించి, డబ్బు తీసుకోవాలంటే కమిషన్ చెల్లించాలని డిమాండ్ చేశారు.