'తక్షణమే విద్యుత్ సమస్యను పరిష్కరించాలి'
జనగాం: జాఫర్‌గఢ్ మండలం తమ్మడపల్లి గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్ ఫేజ్ వైరు కాలిపోవడంతో బోరు మోటార్లు పనిచేయకుండా పోయాయి. దీంతో నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు, లైన్‌మెన్‌కు సమస్య తెలియజేసినా ఎవరూ స్పందించలేదని రైతులు ఆరోపించారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని రైతుల డిమాండ్ చేశారు.