నీటి సమస్య తీర్చాలని మహిళల నిరసన

KDP: ఎర్రగుంట్ల మండలం చిలంకూరులోని సానానగర్లో మంగళవారం నీటి సమస్య తీర్చాలని మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ఏడు నెలల క్రితం వీధి రోడ్డు ఏర్పాటు చేసేందుకు తవ్వకాలు చేపట్టగా.. తాగునీటి పైపులు దెబ్బతినడంతో నీటి సమస్య ఏర్పడిందని తెలిపారు. ఈ విషయాన్ని రాత పూర్వకంగా అధికారులకు తెలిపినా చర్యలు చేపట్టలేదని వాపోయారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.