VIDEO: కసాపురం ఆలయానికి పోటెత్తిన భక్తులు
ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో కార్తీకమాసం 4వ శనివారం సందర్భంగా ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలోని స్వామి వారి మూలమూర్తికి పవిత్ర గంగాజలాలతో అభిషేకాలు నిర్వహించి సింధూరం, తులసి, ఆకు పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చి పెద్ద ఎత్తున స్వామి వారిని దర్శించుకున్నారు.