తాడిపత్రి రోడ్ల అభివృద్ధికి నిధులు కోరిన ఎమ్మెల్యే

తాడిపత్రి రోడ్ల అభివృద్ధికి నిధులు కోరిన ఎమ్మెల్యే

ATP: తాడిపత్రి నియోజకవర్గంలో రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల ఏర్పాటు కోసం నిధులు మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి వినతిపత్రం సమర్పించారు. నియోజకవర్గంలోని రోడ్ల అభివృద్ధి ఆవశ్యకత గురించి ఆయన ఉప ముఖ్యమంత్రికి వివరించారు. రోడ్ల సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఈ సందర్భంగా అస్మిత్ రెడ్డి కోరారు.