కైలాసగిరి స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం

కైలాసగిరి స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం

విశాఖపట్నం కైలాసగిరిపై నిర్మించిన అద్భుతమైన స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జిని ఎంపీ భరత్ ప్రారంభించారు. దేశంలోనే అతి పొడవైన ఈ గ్లాస్ బ్రిడ్జి పర్యాటకులకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. టికెట్ ధరను రూ. 300గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ థ్రిల్లింగ్ బ్రిడ్జిపై ప్రతి పర్యాటకుడు 7 నిమిషాల పాటు విశాఖ అందాలను ఆస్వాదించే అవకాశం ఉంది.