బ్రిడ్జి నిర్మాణానికి అధికారుల పరిశీలన
NLG: దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ఆదేశాల మేరకు మర్రిచెట్టు తండా నుంచి బుడ్డతండా వరకు వాగుపై రూ.1.70 కోట్లతో నిర్మించబోయే బ్రిడ్జి స్థలాన్ని ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు పరిశీలించారు. చీఫ్ ఇంజనీర్ బాలు, ఎస్ఈ హేమలత, ఇతర అధికారులు, సర్పంచులు రాంసింగ్ నాయక్, కొండల్, గీత జైలాల్, మాజీ ఎంపీటీసీ సీత్య నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.