'తుఫాన్ అలర్ట్.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి'

'తుఫాన్ అలర్ట్.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి'

SKLM: శ్రీకాకుళం జిల్లాలోని ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో తుఫాన్ అలర్ట్ కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 19 వరకు అధికారులకు ఎటువంటి సెలవులు మంజూరు చేయబడవని తెలియజేశారు. నిత్యావసర వస్తువులు నిల్వలు ఉంచాలని సూచించారు.