మరుగు దొడ్లు నిర్మించండి సార్
KMR: లింగంపేట మండలం కొండాపూర్ తండాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్లు, వంట గది లేదని పాఠశాల ప్రధానోపాధ్యా యుడు ధూప్ సింగ్, గ్రామస్థులు బుధవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యేకు వినతిపత్రం రాశారు. పాఠశాలలో మరుగుదొడ్లు, వంట గదులు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు. వెంటనే స్పందించి నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు.