అయోధ్య పురంలో ఇంటింటి సర్వే చేపట్టిన సీపీఎం

అయోధ్య పురంలో ఇంటింటి సర్వే చేపట్టిన సీపీఎం

WGL: గ్రేటర్ వరంగల్ పరిధిలోని 46వ డివిజన్ అయోధ్య పురం బూడిద జంగాల కాలనీలో నేడు సీపీఎం పార్టీ కార్యకర్తలు ఇంటింటి సర్వేను ప్రారంభించారు. సీపీఎం పార్టీ మండల కార్యదర్శి పోరుగంటి సాంబయ్య ఆధ్వర్యంలో కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి స్థానికంగా ఎదురవుతున్న సమస్యలు వ్యక్తిగత సమస్యలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో సంటి రవి, జంపాల రమేష్ పాల్గొన్నారు.