సామెత-దాని అర్థం
సామెత: 'అత్త లేని కోడలు ఉత్తమురాలు.. కోడల్లేని అత్త గుణవంతురాలు'
అర్థం: ఇంట్లో అత్త లేకపోతే, కోడలిని ప్రశ్నించే వారు ఎవరూ ఉండరు. కాబట్టి ఆమె చేసే పనులన్నీ సవ్యంగానే ఉన్నట్లు కనిపిస్తాయి కాబట్టి 'ఉత్తమురాలు' అనిపించుకుంటుంది. అలాగే, ఇంట్లో కోడలు లేనప్పుడు అత్తగారు ఎవరినీ శాసించాల్సిన అవసరం రాదు. ఆమె తన పద్ధతిలో తాను ఉంటుంది కాబట్టి ఆమె చాలా 'గుణవంతురాలు' అనిపిస్తుంది.