రోడ్లపై వరి ధాన్యం ఆరబోయే వద్దు: SI
BHPL: టేకుమట్ల మండల పరిధిలోని పలు గ్రామాల్లో రైతులు రహదారులపై వరి ధాన్యం ఆరబోస్తుండటంపై ఎస్సై సుధాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం వల్ల వాహనాలు జారి ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని, వెంటనే ఈ పద్ధతి మానివేయాలని హెచ్చరించారు. ఇప్పటికే రోడ్లపై ఆరబోసిన వడ్లను తక్షణం తొలగించాలని, లేకుంటే సంబంధిత రైతులపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.