హిట్ ఇచ్చిన డైరెక్టర్‌తో శ్రీవిష్ణు మరో సినిమా!

హిట్ ఇచ్చిన డైరెక్టర్‌తో శ్రీవిష్ణు మరో సినిమా!

శ్రీవిష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినట్లు సమాచారం . గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'సామజవరగమన' బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇటీవల శ్రీవిష్ణు నటించిన రెండు సినిమాలు నిరాశపరచడంతో, ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ తాజాగా ప్రారంభమైనట్లు టాక్.