నవంబరు 14న తిరుపతిలో కార్తీక దీపోత్సవం
తిరుపతిలోని TTD పరిపాలనా భవనం మైదానంలో ఈనెల 14న కార్తీక దీపోత్సవం జరగనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం TTD విస్తృత ఏర్పాట్లు చేపడుతోందన్నారు.