ఆశా కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం
KNR: జమ్మికుంట మండలం తనుగులకి చెందిన ఆశా కార్యకర్తగా విధులు నిర్వహించే సంపూర్ణ 10 రోజుల క్రితం గుండెపోటుతో మృతిచెందింది. ఆమె కుటుంబ సభ్యులకు వైద్య సిబ్బంది మంగళవారం రూ.45,500 ఆర్థిక సహాయం అందించింది. వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పనిచేసే సంపూర్ణ కుటుంబానికి వైద్యాధికారి, ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు అండగా నిలిచారు.