నవ్వాలని ఉన్నా నవ్వలేం: గౌతీ
ఎన్నో అంచనాల మధ్య మ్యాచ్ ఆడుతున్నప్పుడు నవ్వాలని ఉన్నా నవ్వలేని పరిస్థితి ఉంటుందని టీమిండియా కోచ్ గంభీర్ అన్నాడు. 'కోచ్ సాబ్ ముఖంపై చిరునవ్వు బాగుంది' అంటూ ధోనీ చేసిన పోస్ట్‌పై స్పందిస్తూ.. ప్లేయర్లకు ఇలాంటి పరిస్థితి లేకున్నా కోచ్‌కు ఉంటుందని పేర్కొన్నాడు. వరల్డ్ కప్ వంటి వేదికల్లో మ్యాచ్ ఓడిపోతే ఇన్నాళ్లూ పడిన కష్టం జీరో అయిపోతుందని గంభీర్ చెప్పుకొచ్చాడు.