ఓయో రూమ్స్‌పై పోలీసుల తనిఖీలు
MDCL: అల్వాల్ పోలీసులు స్థానిక ప్రాంతాల్లోని ఓయో (OYO) రూమ్స్‌పై సడన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆధార్ కార్డులపై నిత్యం దృష్టి సారించాలని ఓయో యజమానులకు పోలీసులు సూచించారు. మైనర్లకు, ఆధార్ కార్డు లేనివారికి రూమ్స్ ఇవ్వొద్దని గట్టిగా ఆదేశించారు. ఈ తనిఖీల్లో అల్వాల్ ఇన్‌స్పెక్టర్ ఏ.ప్రశాంత్ కుమార్, ఎస్సై దేవేందర్ పాల్గొన్నారు.