‘పేదాల పక్షాన పోరాడిన శక్తి గౌతు లచ్చన్న’

SKLM: సర్దార్ గౌతు లచ్చన్న శ్రీకాకుళం జిల్లాకు ఎంతో గుర్తింపును తెచ్చిన వ్యక్తి అని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అన్నారు. కొత్తూరు మండల కేంద్రంలో శనివారం గౌతు లచ్చన్న 116వ జయంతి నిర్వహించారు. గౌతు లచ్చన్న ఒక వ్యక్తి కాదని పేదల పక్షాన పోరాడిన ఒక శక్తిని కలమట కొనియాడారు. లచ్చన్న చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులర్పించారు.